దేశంలో ఒకే సారి
ఎన్నికలు (జమిలి) నిర్వహించాలని
మోదీ ప్రభుత్వం భావిస్తోంది. నిత్యం ఎన్నికల వాతావరణాన్ని తొలగించి అభివృద్ధిపై పాలనను కేంద్రీకరించే లక్ష్యంతో ఈ బిల్లును తెచ్చినట్టు తెలుస్తోంది. 2028 జులైలోపు బిల్లు వస్తే 2029 జనరల్
ఎన్నికలు జమిలిగా నిర్వహించడం సాధ్యమేనని చెబుతున్నారు. అయితే 2029 నుంచి 2034 వరకు విడతల వారీగా జమిలి
ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన జేపీసీ వద్ద ఉన్నట్టు సమాచారం. దీని ప్రకారం.. 2028లో అసెంబ్లీ
ఎన్నికలు జరిగే TGతో సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ గడువు మరో ఐదారు నెలలు పొడిగించాల్సి ఉంటుంది. మరికొన్నిరాష్ట్రాల గడువు తగ్గించవచ్చు. ఇక మూడో విడతలో భాగంగా 2030, 31లో జరిగే రాష్ట్రాల అసెంబ్లీలను ఒకటి లేదా రెండేళ్లు తగ్గించి 2034 లోక్‌సభ ఎన్నికలతోపాటు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఫలితంగా 2034 నుంచి జమిలి
ఎన్నికలు సంపూర్ణంగా అమల్లోకి వస్తాయి.