రాష్ట్రానికి కొత్త ఈసీ వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు?

22చూసినవారు
రాష్ట్రానికి కొత్త ఈసీ వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు?
AP: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని స్థానంలో కొత్త కమిషనర్ వచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. జనవరిలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచనలు కూడా ఇచ్చింది. అయితే, పంచాయతీల పునర్విభజన, విలీనం పూర్తికాకపోవడం, వచ్చే నెల 2వ తేదీ నుంచి జనగణన ప్రారంభం కావడం వంటి సాంకేతిక, రాజకీయ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్