AP: స్థానిక సంస్థల ఎన్నికలపై
వైసీపీ నేత రవీంద్రనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్
ఎన్నికలు నకిలీ ఎన్నికలను తలపించాయని, అధికార బలం, పోలీసుల సహకారంతో ఫలితాలను తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ అక్రమాలకు మంత్రి నారా లోకేశే కారణమని ఆయన విమర్శించారు.