కర్ణాటకలోని బెట్టద భైరవేశ్వర ఆలయంలో ప్రీవెడ్డింగ్ షూట్ వివాదానికి దారితీసింది. ఫొటోగ్రాఫర్లు షూ వేసుకుని గుడిలోకి వెళ్లడంతో ఆగ్రహించిన స్థానికులు వారిని చితకబాది, కెమెరాను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దాడికి పాల్పడిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.