పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కీలక దశకు చేరుకున్నాయి. లోక్ సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా శని, ఆదివారాలు సభకు సెలవులైనప్పటికీ, బడ్జెట్ సమర్పణ కోసం సభ ప్రత్యేకంగా సమావేశం కానుంది.