టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూక‌బ్జాపై లోకాయుక్త కోర్టు సీరియస్

17చూసినవారు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూక‌బ్జాపై లోకాయుక్త కోర్టు సీరియస్
మాజీ సైనికులకు కేటాయించిన 2.92 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించి, కబ్జా చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌పై లోకాయుక్త కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బి.కె.పల్లి గ్రామంలోని చెరువు పోరంబోకు భూమిని కబ్జా చేసినట్లు కలెక్టర్ నివేదిక నిర్ధారించింది. సెలవు రోజైన ఆదివారం నాడు రికార్డులు మార్చి, నకిలీ పట్టాతో ఎమ్మెల్యే, ఆయన భార్య సరళ పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం కింద క్రిమినల్ కేసులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్