స్కూల్‌లో తన బర్త్ డే వేడుకలు నిర్వహించడంపై లోకేష్ అసంతృప్తి

68చూసినవారు
AP: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ స్కూల్‌లో గురువారం మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. దీనిపై లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'పాఠశాలలు, విశ్వ విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించాను. భవిష్యుత్తులో పునరావృతం కాకుండా చూడాలని వారిని కోరుతున్నాను' అని ప్రకటన విడుదల చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you