AP: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం’ బహిరంగ సభలో మంత్రి
లోకేశ్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు వేదికపై చెప్పులు విడిచి, భక్తిపూర్వకంగా ‘ఓం నమో వేంకటేశాయ’ మంత్రాన్ని జపించారు. అనంతరం ప్రసంగం ప్రారంభించారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిపై తన భక్తిని చాటుతూ
లోకేశ్ చేసిన ఈ చర్య సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.