AP: పార్లమెంటులో ఏపీ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా ఆమోదించిన నేపథ్యంలో అమరావతికి సంబంధించిన చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రి లోకేష్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన ఏపీకి చెందిన ఎన్డీఏ ఎంపీలను కలిసి అమరావతి తీర్మానానికి మద్దతునిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గురువారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో లోకేశ్ తో పాటు, పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. బిల్లుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక రైతుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు.