అమెరికాలో లోకేష్ పర్యటన.. ఐటీ కంపెనీలతో కీలక సమావేశాలు

2279చూసినవారు
అమెరికాలో లోకేష్ పర్యటన.. ఐటీ కంపెనీలతో కీలక సమావేశాలు
అమెరికాలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన నాలుగో రోజు పర్యటనలో భాగంగా పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో ఇంటెల్ ATMP యూనిట్ ఏర్పాటు చేయాలని, అమరావతిలో ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఎన్విడియా స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్టును ఏపీలోనూ ప్రారంభించాలని, విశాఖలో అడోబ్ జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. గూగుల్ ఏఐ డాటా సెంటర్ పనుల పురోగతిని సమీక్షించి, గూగుల్ డ్రోన్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను కూడా మంత్రి లోకేష్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్