AP: క్యాన్సర్ బాధితుడికి మంత్రి లోకేశ్ అండగా నిలిచారు. గుంటూరు జిల్లా ధర్మకోటకు చెందిన గార్లపాటి బ్రహ్మయ్య.. క్యాన్సర్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యానికి సుమారు రూ. 5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. బ్రహ్మయ్యని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ఎక్స్ ద్వారా లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించిన ఆయన CM సహాయ నిధి ద్వారా రూ.3 లక్షల LOC మంజూరు చేసి అండగా నిలిచారు.