ఏపీలో రెండు బైకులను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

9462చూసినవారు
ఏపీలో రెండు బైకులను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
AP: పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలం ములకలూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా  వస్తున్న లారీ ప్రమాదవశాత్తూ రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో రాకేశ్‌, జానీ అనే ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్