మహారాష్ట్రలోని మన్మాడ్ సమీపంలో ఇండోర్-పుణె జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుండి పారిపోవడానికి ప్రయత్నించిన డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మన్మాడ్, మలేగావ్ ఆసుపత్రులకు తరలించారు.