లారీ-ఆర్టీసీ బస్సు ఢీ.. 8 మందికి గాయాలు

15272చూసినవారు
లారీ-ఆర్టీసీ బస్సు ఢీ.. 8 మందికి గాయాలు
AP: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు మిర్యాలగూడ నుంచి దాచేపల్లికి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్