రైలులో ఫోన్‌ పోతే.. వెంటనే ఇలా చేయండి!

3931చూసినవారు
రైలులో ఫోన్‌ పోతే.. వెంటనే ఇలా చేయండి!
రైలు ప్రయాణంలో మొబైల్ ఫోన్ పోయినప్పుడు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి దక్షిణ రైల్వే ఒక కొత్త డిజిటల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF) టెలికమ్యూనికేషన్ విభాగం ఈ సేవలను అందిస్తున్నాయి. ప్రయాణికులు రైల్‌ మదద్‌ యాప్ లేదా 139 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదు ఆధారంగా, సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (CEIR) పోర్టల్‌లో మొబైల్ వివరాలు నమోదు చేసి, ఫోన్ IMEI నంబర్ ఆధారంగా పరికరాన్ని బ్లాక్ చేస్తారు. దీనివల్ల PSకు వెళ్లే అవసరం లేకుండానే తక్షణ రక్షణ లభిస్తుంది.

సంబంధిత పోస్ట్