‘లవ్ టుడే’తో యూత్ ఐకాన్‌గా మారిన ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) సినిమా తెలుగు టీజర్ విడుదలైంది. 2040 నాటి ప్రపంచాన్ని, టెక్నాలజీ యుగంలో ప్రేమను ఆసక్తికరంగా చూపించే ఈ టీజర్‌లో ఫ్యూచరిస్టిక్ విజువల్స్, అనిరుధ్ సంగీతం హైలైట్‌గా నిలిచాయి. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ ప్రేమకథ ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇందులో ఎస్.జె. సూర్య కూడా నటిస్తున్నారు.