ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్‌లో దారుణం చోటుచేసుకుంది. 34 ఏళ్ల రైతు సచిన్ దగర్ తన భార్య రచన చేతిలో హత్యకు గురయ్యాడు. రచన తన ఇన్‌స్టాగ్రామ్‌లో సోను అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి బంధానికి భర్త సచిన్ అడ్డుగా ఉన్నాడని భావించి తినే ఖీర్‌లో విషం కలిపి, ఆపై గొంతు నులిమి హత్య చేసింది. అయితే హత్య జరిగిన సమయంలో సోను ఆ ఇంట్లోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. రచనను అరెస్టు చేయగా, సోను పరారీలో ఉన్నాడు.