లో బీపీ ఉపశమనానికి చిట్కాలు

6749చూసినవారు
లో బీపీ ఉపశమనానికి చిట్కాలు
వైద్య పరిభాషలో 90/60 mmHg కంటే తక్కువ రక్తపోటును హైపోటెన్షన్ అంటారు. శరీరంలో నీటి శాతం తగ్గడం, సోడియం లోపం దీనికి ప్రధాన కారణాలు. అకస్మాత్తుగా బీపీ పడిపోయినప్పుడు ఒక గ్లాసు ఉప్పు నీరు తాగడం, కాళ్లను పైకి ఎత్తి పడుకోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తల తిరగడం, నీరసం, ఏకాగ్రత దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డీహైడ్రేషన్ నివారణకు పుష్కలంగా నీరు, కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు తాగాలి. స్ట్రాంగ్ టీ, కాఫీ తాత్కాలికంగా బీపీని పెంచుతాయి. లో బీపీని నిర్లక్ష్యం చేస్తే మెదడు, గుండె వంటి అవయవాలకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్