AP: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎల్లుండి నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో వారం పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.