అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

84చూసినవారు
అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :