అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

31281చూసినవారు
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు
AP: దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. సోమవారం నాటికి ఇది వాయుగుండంగా మారొచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.