AP: విశాఖపట్నానికి ఏఐ హబ్, డిజిటల్ డేటా సెంటర్ రానున్న నేపథ్యంలో, ప్రముఖ అంతర్జాతీయ రిటైల్ సంస్థ 'లులు గ్రూప్' తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. రూ.1,222 కోట్ల అంచనా వ్యయంతో హార్బర్ పార్క్ వద్ద 13.74 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రానుంది. ఇందులో హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, ఫన్ టూర్ వంటివి ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తోంది.