ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన సంభవించనుంది. హోలీ పౌర్ణమి రోజున ఏర్పడనున్న ఈ గ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. దీంతో గ్రహణ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేయనున్నారు. 2026లో మొత్తం 2 గ్రహణాలు సంభవించనున్నట్లు ఖగోళ నిపుణులు చెబుతున్నారు. రెండోది ఆగస్టు 28న ఏర్పడనున్నట్లు పేర్కొన్నారు.