ఊపిరితిత్తుల క్యాన్సర్.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు!

10682చూసినవారు
ఊపిరితిత్తుల క్యాన్సర్.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు!
వేగంగా బరువు తగ్గడం, ఆకలి తగ్గిపోవడం, మూడు వారాలకు పైగా దగ్గు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు తొలి సంకేతాలు కావచ్చని డాక్టర్ సమీర్ ఖత్రి తెలిపారు. దగ్గుతో పాటు కొద్దిపాటి రక్తం, శ్వాసలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, గొంతు బొంగురుపోవడం వంటివి కూడా ప్రమాద సంకేతాలని ఆయన పేర్కొన్నారు. ధూమపానం చేయనివారిలోనూ ఈ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, పరోక్ష ధూమపానం, వాయు కాలుష్యం కూడా కారణాలని తెలిపారు. తొలిదశలో గుర్తిస్తే చికిత్స విజయవంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్