ఎంఆధార్ యాప్ నిలిపివేత.. కొత్త యాప్ వాడండి: UIDAI

6622చూసినవారు
ఎంఆధార్ యాప్ నిలిపివేత.. కొత్త యాప్ వాడండి: UIDAI
జూన్ 30వ తేదీ నుంచి ఎంఆధార్ యాప్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు UIDAI ప్రకటించింది. నేటి నుంచి ఈ యాప్ పనిచేయదని, కొత్త ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. కొత్త యాప్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరణ, ఫేస్ అథెంటికేషన్, బయోమెట్రిక్ లాక్ వంటి అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయని వివరించింది. దీనివల్ల ఆధార్ మోసాల ప్రమాదం తగ్గి, గోప్యత పెరుగుతుందని వెల్లడించింది. పేరు, వయస్సు వంటి అవసరమైన సమాచారాన్ని మాత్రమే పంచుకోవచ్చని, UIDAI లోగో ఉన్న యాప్‌ను మాత్రమో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్