అనంతపురం జిల్లా హిందూపురం మండలం లేపాక్షిలో ఆదివారం పిచ్చికుక్క గ్రామస్థులపై విచక్షణారహితంగా దాడి చేయడంతో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. గాయపడిన వారిలో 9 మందికి స్థానిక పీహెచ్‌సీలో టీకాలు వేయగా, ముగ్గురిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులే ఆ పిచ్చికుక్కను చంపినట్లు సమాచారం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.