AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై ఆ కుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారుల దవడ, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.