ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన మాధవి లత ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ జీవితం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ఆశయాల గురించి తెలిపారు. 'నచ్చావులే' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, పరిశ్రమలో 'షి ఈజ్ నాట్ ఫ్రెండ్లీ' అనే పేరు వచ్చిందని చెప్పారు. యాంకరింగ్ ద్వారా సినీ రంగంలోకి వచ్చిన ఆమె, చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో ఉండాలని, గ్రామ సర్పంచ్‌గా ఎదగాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దర్శకుడు రవిబాబుతో పనిచేసిన అనుభవాలను కూడా పంచుకున్నారు.