ఉత్తరాఖండ్‌లో మదర్సా బోర్డు రద్దు: ఇకపై సాధారణ పాఠశాలలే

398చూసినవారు
ఉత్తరాఖండ్‌లో మదర్సా బోర్డు రద్దు: ఇకపై సాధారణ పాఠశాలలే
ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మదర్సా బోర్డులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి మదర్సాలు రద్దవుతాయి. గుర్తింపు పొందిన మదర్సాలను సాధారణ పాఠశాలలుగా పరిగణిస్తారు. మతపరమైన బోధనతో పాటు ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రిజిస్టర్డ్ మదర్సాల్లో సాధారణ సిలబస్‌తో పాటు ఎన్‌సీఈఆర్‌టీ ఆధారిత పాఠ్యాంశాలు, సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ వంటి ఆధునిక సబ్జెక్టులను బోధించాలని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్