AP: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని సైకిల్ స్టాండ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.