AP: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలు దుకాణంలోని రెండు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే దుకాణంలోని వస్త్రాలు దగ్ధమయ్యాయి. భారీగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది.