AP: తిరుపతి జిల్లా రేణిగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మునోత్ గ్రూప్‌కి చెందిన లిథియం సెల్ యూనిట్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.70–80 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. పరిశ్రమలో సిబ్బంది లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.