TG: నెల్లూరు జిల్లా దగదత్తిలో కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇటీవల టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే ఇవాళ మాలేపాటి స్వస్థలం దగదర్తిలో ఉత్తర క్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్లా శ్రీనివాసరావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెళ్లారు. దీంతో మాలేపాటి వర్గీయులు పల్లా MLAను అడ్డుకున్నారు. గతంలో సుబ్బానాయుడిని MLA ఇబ్బందులు పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో వారు అడ్డుకున్నారు.