AP:రాజధాని విస్తరణలో భాగంగానే మలిదశ భూ సమీకరణ చేపడుతున్నామని మంత్రి నారాయణ కేబినెట్ సమావేశం అనంతరం తెలిపారు. రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం, స్మార్ట్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి కీలక ప్రాజెక్టుల కోసం 16,666 ఎకరాల భూమిని సమీకరిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ సమీకరణ రైతుల అంగీకారంతోనే జరుగుతుందని స్పష్టం చేశారు. ఒలింపిక్స్ నిర్వహించే స్థాయిలో అంతర్జాతీయ క్రీడానగరం నిర్మిస్తామని మంత్రి తెలిపారు.