తిరుమలలో నకిలీ ఐడీలతో భక్తులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

1256చూసినవారు
తిరుమలలో నకిలీ ఐడీలతో భక్తులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
AP: తిరుమలలో భక్తులను మోసం చేస్తున్న తమిళనాడుకు చెందిన మురుగన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు జేబు దొంగతనం చేస్తూ పట్టుబడిన మురుగన్, భక్తులను నమ్మించడానికి నకిలీ టీటీడీ, ఎయిర్‌పోర్ట్ ఐడీ కార్డులను ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది. మాంగళ్య పూజ పేరుతో బంగారం, నగదు కాజేసే ప్రయత్నం చేసినట్లు, గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్