AP: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురవరాజుపల్లిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ సృష్టించాడు. స్థానిక పొలాల్లోని 220 కేవీ టవర్‌పై అర్ధరాత్రి 2 గంటల నుంచి అతడు వేలాడుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందారు. కిందికి దిగమని పలుమార్లు కోరినా వినకపోవడంతో అర్బన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయితే ఆ వ్యక్తి వివరాలు, టవర్ ఎక్కడానికి గల కారణాలు తెలియలేదు.