గొంతులో అన్నం ఇరుక్కుని వ్యక్తి మృతి

31489చూసినవారు
గొంతులో అన్నం ఇరుక్కుని వ్యక్తి మృతి
TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. గొంతులో అన్నం ఇరుక్కుని ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దామరవంచ శివారు పిల్లిగుండ్లతండాకు చెందిన బానోతు బిచ్చా(54) మంగళవారం దుర్గమ్మ పండుగా జరుపుకున్నారు. అయితే రాత్రి భోజనం చేస్తున్న సమయంలో గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుంది. వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్