బిడ్డ పుట్టిన అనంతరం తాను స్వలింగ సంపర్కుడినని భర్త చెప్పడంతో ఓ కుటుంబంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేక్ అనే వ్యక్తి, తన భార్య ఒకే సంస్థలో పనిచేస్తూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు జన్మించిన తర్వాత తాను గే అని భార్యకు నిజం చెప్పాడు. ఆ తర్వాత దాంపత్య జీవితం ముగిసినా, కుమారుడి భవిష్యత్తు దృష్ట్యా ఇద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరుగా నివసించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వివేక్ తన భాగస్వామితో కలిసి ఇంటి మొదటి అంతస్తులో ఉండగా, అతని భార్య తన కుమారుడితో రెండో అంతస్తులో నివసిస్తున్నట్లు ఉంటున్నారు.