AP: మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా పి.త్రివిక్రమ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. వీటితో పాటు అధికారిక భాషా సంఘం చేయాల్సిన కార్యకలాపాలపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలో తెలుగు భాష వాడుక తీరుపై తనిఖీలు చేయాలని నిర్దేశించింది.