AP: చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడికి కేవలం 5 రూపాయల ధర నిర్ణయించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యూస్ ఫ్యాక్టరీల సిండికేట్ మామిడి రైతులను నిలువు దోపిడీ చేస్తుందని ఆరోపిస్తూ, జీడి నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ ఎదుట రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఈ దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.