వయసు పైబడటంతో వచ్చే వృద్ధాప్య ఛాయలు, చర్మంపై ముడతలతో బాధపడేవారికి మునగాకు జ్యూస్ ఒక చక్కని పరిష్కారం. మునగాకు పోషకాల గని. ఇందులో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. గర్భిణీలకు రక్తహీనతను తగ్గించి, శిశువుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్, చర్మ, జుట్టు సమస్యలకు మునగాకు జ్యూస్ మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడం, ఎముకలను పుష్టిగా చేయడం, డయాబెటిస్‌ను నియంత్రించడం, గుండెకు మేలు చేయడం, యవ్వనంగా కనిపించేలా చేయడంలో దీని పాత్ర కీలకం.