ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లేవారికి విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. చైనా భూభాగంలోకి ప్రవేశించడానికి ఎంట్రీ పర్మిట్,
వీసా తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ అనుమతులు లేకుండా నేపాల్‌లో చిక్కుకుపోయిన యాత్రికుల విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ప్రయాణానికి అవసరమైన అన్ని ట్రావెల్ డాక్యుమెంట్లు పొందిన తర్వాతే బయలుదేరాలని, టూర్ ఆపరేటర్ సక్రమంగా రిజిస్టరైందేనని ధ్రువీకరించుకోవాలని సూచించింది.