ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజుకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ యోగా, నేచురోపతి విభాగం సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజును నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ హోదాలో గౌరవ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మంతెన సత్యనారాయణ రాజుకు వాహనం, ఆఫీస్, కార్యాలయ సిబ్బంది సౌకర్యాలు, అధికారిక పర్యటనలకు ట్రావెల్ అలవెన్స్ సౌకర్యం కల్పిస్తారు.