వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

26చూసినవారు
వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
AP: వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్‌ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు తీవ్రంగా మండిపడ్డారు. పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల నిర్మాణ, నిర్వహణకు ముందుకు వచ్చిన వారిని, అభివృద్ధి పనులు చేయడానికి ఆసక్తి చూపుతున్న కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్‌, బొత్స సత్యనారాయణ పై నిప్పులు చెరిగారు. విజయనగరం జడ్పీ అతిథి గృహంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం. వారు సిద్ధాంతం కోసం పోరాడారు. బెదిరింపులకు పాల్పడడమే YCP నేతల లక్ష్యం’ అని ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్