AP:: మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. బుధవారం మార్కాపురంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుని తమ ఇంట్లో దేవుడిలా పూజించుకుంటామని, తాము చేసిన ఉద్యమాన్ని గుర్తించి మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించారని చెప్పారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టుని కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడే చంద్రబాబు విగ్రహం కట్టిస్తానన్నారు.