మరో ఐదు రోజుల్లో పెళ్లి.. యువకుడు ఆత్మహత్య

24533చూసినవారు
మరో ఐదు రోజుల్లో పెళ్లి.. యువకుడు ఆత్మహత్య
TG: మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. మై హోమ్ మంగళ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి(30)కి ఈ నెల 12న వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే పెయిన్ కిల్లర్ మాత్రలు తీసుకుని, కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు శ్రీ సాయి తన సోదరుడికి మెసేజ్ పంపినట్లు సమాచారం. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్