భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

9866చూసినవారు
భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
సూర్యాపేట(D) నడిగూడెం(M) వల్లాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని మనస్తాపం చెంది ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుందిది. గ్రామానికి చెందిన సారగండ్ల కోటేశ్వరరావు, స్వాతి దంపతులు. జేసీబీ ఆపరేటర్ గా పనిచేస్తున్న కోటేశ్వరరావుకు భార్య స్వాతి ఫోన్ చేసిన సమయంలో ఆయన సమాధానం ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన స్వాతి ఇంట్లో రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల సాయంతో భర్త కోటేశ్వరరావు ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 4న స్వాతి మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్