చిన్న కుక్కే కరిచిందని నిర్లక్ష్యం.. వివాహిత మృతి

25615చూసినవారు
చిన్న కుక్కే కరిచిందని నిర్లక్ష్యం.. వివాహిత మృతి
AP: చిన్న కుక్కే కరిచిందని నిర్లక్ష్యం వహించడంతో ఓ వివాహిత అనారోగ్యం బారినపడి ప్రాణం విడిచింది. కృష్ణా జిల్లా రొయ్యూరు గ్రామానికి చెందిన పరిశే యేసుబాబు భార్య పరిశే అరవింద (35)ను నాలుగు నెలల క్రితం ఇంటి పరిసరాల్లో ఉండే చిన్న కుక్క కరిచింది. పెంపుడు కుక్కే కదా అని, ఆమె టీటీ ఇంజక్షన్ మాత్రమే చేయించుకున్నారు. అనుకోకుండా నాలుగు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్