AP: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పెద్దాపూర్ గ్రామంలో శుక్రవారం మార్గం నర్సమ్మ (42) అనే మహిళ మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో లభ్యమైంది. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన నర్సమ్మ మృతదేహం గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రం వద్ద కనిపించింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా ఫలితం దక్కలేదు. భర్త సత్తయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ రంగ కృష్ణ మృతదేహాన్ని పరిశీలించారు.