టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు

18చూసినవారు
టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు
AP: ఎన్టీఆర్‌ జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. గంపలగూడెం మండలం సత్యాలపాడులో శుక్రవారం రాత్రి 15 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి. వారందరికీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ క్రియాశీలక కార్యకర్తలైన ముక్కెర కోటిరెడ్డి, అవులూరు భార్గవరెడ్డి, వరదబోయిన గోపి, సంపసాల నారాయణ, ముక్కెర రాజశేఖరరెడ్డి, వెంకటమ్మ, సత్యనారాయణరాజు, సరికొండ గోపరాజు, మురళి తదితరులు పార్టీలో చేరినట్లు గోవర్ధనరెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్